లాభాల బాటలో... ‘లోథా’

ABN , First Publish Date - 2021-08-04T00:16:13+05:30 IST

‘లోథా’ బ్రాండ్ కింద పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్, జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

లాభాల బాటలో... ‘లోథా’

హైదరాబాద్ : ‘లోథా’ బ్రాండ్ కింద పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్... జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. వరుస ప్రాతిపదికన దాని ఆదాయం రూ . 1600 కోట్లు.. పన్ను తరువాత లాభం రూ. 160 కోట్లు. ఈ స్టాక్ మంగళవారం దాదాపు 2 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయి రూ. 944 ను తాకింది. అమ్మకాల విషయంలో ఢోకా లేకపోవడంతో లోథాకు  కలిసొచ్చింది. జూన్ త్రైమాసికంలో ల్యాండ్ బ్యాంక్ నుంచి రూ. 140 కోట్ల అమ్మకాలతో కలిపి లోథా రూ. 960 కోట్ల ప్రి సేల్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రి సేల్స్ 53 శాతంగా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. కాగా... రుణభారాన్ని తగ్గించుకోవాలని కంపెనీ యత్నిస్తోంది. 

Updated Date - 2021-08-04T00:16:13+05:30 IST