కొత్త మార్కెట్‌ దిశగా ‘లోథా’...

ABN , First Publish Date - 2021-11-24T05:30:00+05:30 IST

మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌పరంగా దేశంలో రెండో అతి పెద్ద లిస్టెడ్ రియాల్టీ ప్లేయర్ ‘లోథా’,,, కొత్త మార్కెట్లలో పిల్లర్స్‌ వేస్తోంది.

కొత్త మార్కెట్‌ దిశగా ‘లోథా’...

ముంబై : మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌పరంగా దేశంలో రెండో అతి పెద్ద లిస్టెడ్ రియాల్టీ ప్లేయర్ ‘లోథా’,,, కొత్త మార్కెట్లలో పిల్లర్స్‌ వేస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణెల్లో... ఇప్పటివరకు రియల్‌ ఎస్టేట్‌ ప్రాతినిధ్యం లేని మైక్రో మార్కెట్లపై కన్నేసింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో గత వారం రూ. 4 వేల కోట్లను సేకరించిన ఈ కంపెనీ... కొత్త ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించడనికి ఆ నిధులను  ఉపయోగించనుంది. ఐటీ రంగం నుంచి వస్తున్న డిమాండ్‌ నేపధ్యంలో...  బెంగళూరు మార్కెట్‌లోకీ అడుగుపెట్టాలని భావిస్తోంది.


వచ్చే సంవత్సరం కాలంలో క్యాపిటల్‌ రైజ్‌ ఉంటుందని రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా లోథా ప్రకటించిన విషయం తెలిసిందే. లిస్టింగ్ నుండి మూడేళ్లలోగా కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్‌ను 88.5 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలన్న నిబంధన నేపధ్యంలో... ఈక్విటీ రూట్‌లో ఈ ఫండ్‌ రైజింగ్‌ ఉంటుందని మార్కెట్‌ భావిస్తోంది. ఊహించిన దానికంటే ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎంకే రీసెర్చ్ చెబుతోంది. ఈ సంస్థ... రెండోత్రైమాసికంలో నివేదించిన రూ. 2,003 కోట్ల ప్రీ-సేల్స్‌, వై టు వై లో 88 శాతం, త్రైమాసికంగా చూస్తే 104 శాతం పెరిగాయి. కొత్త లాంచ్‌లను కలుపుకుని రూ. 9 వేల ప్రీ-సేల్స్‌ను కంపెనీ అంచనా వేస్తోంది. 


నిధుల సమీకరణ తర్వాత, ప్రీ-సేల్స్‌ను 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 14 వేల కోట్లకు, 2026 ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 20 వేల కోట్లకు పెంచాలని లోథఈా యోచిస్తోంది. జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ మోడల్ ద్వారా... డెలివరేజింగ్, క్యాపిటల్-లైట్ ఎక్స్‌పాన్షన్‌ లక్ష్యాలను సాధించడానికి నిధుల సమీకరణ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. కంపెనీకి బలమైన జేడీఏ పైప్‌లైన్‌ ఉంది, రాబోయే ఆరు త్రైమాసికాలలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని చూస్తోంది.


జేఎం ఫైనాన్షియల్ ప్రకారం... వచ్చే ఏడాదిన్నరలో రూ. 40 వేల కోట్ల మేర అమ్మకాలు చేయగల జేడీఏలపై సంతకం చేయాలని లోథా భావిస్తోంది. సెప్టెంబరు త్రైమాసికం చివరి నాటికి రూ. 12,500 కోట్ల నికర రుణాన్ని, 2022 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి రూ. 10 వేల కోట్లకు తగ్గించాలని కంపెనీ నిర్ణయించుకుంది. కాగా... 2022 ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఔట్‌ఫ్లోస్‌ రూ. 3 వేలు కోట్లుగా, ఇన్‌ఫ్లోస్‌ రూ. 5,500 కోట్లుగా ఉంటాయని అంచనా వేస్తోంది. 

Updated Date - 2021-11-24T05:30:00+05:30 IST