పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , First Publish Date - 2020-09-20T06:14:58+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడం లక్ష్యంగా జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టిన టాక్సేషన్‌ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది...

పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడం లక్ష్యంగా జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టిన టాక్సేషన్‌ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల జారీ గడువు, పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు, పీఎం కేర్స్‌ నిధికి ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు, ఐటీ చట్టం పరిధిలోని కనీసం 8 ప్రాసె్‌సలకు ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌ వంటి చర్యలన్నింటికీ ఈ బిల్లులు అధికారముద్ర వేస్తాయి. కొవిడ్‌-19 కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల నివారణకు జీఎ్‌సటీ, ఐటీ సడలింపులు ఇవ్వడం దీని లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 


కంపెనీల చట్ట సవరణ బిల్లుకు ఓకే 

కంపెనీల చట్టంలో మరిన్ని సవరణల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడంతోపాటు కొన్ని నేరాలను డీక్రిమినలైజ్‌ చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

Updated Date - 2020-09-20T06:14:58+05:30 IST