జగన్‌ చేతకాని పాలనవల్లే గర్భిణి మృతి: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-05-11T09:36:07+05:30 IST

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌తో గర్భిణి మృతి చెందిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు

జగన్‌ చేతకాని పాలనవల్లే గర్భిణి మృతి: లోకేశ్‌

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌తో గర్భిణి మృతి చెందిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘కరోనా పేషెంట్లకు కాకినాడ ఆస్పత్రిలో కనీస వైద్యసేవలు అందడం లేదని అన్నందుకు నాపై కేసులు పెట్టారు. ఆస్పత్రిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన వలంటీర్‌ లక్ష్మి ఏడు నెలల గర్భిణి. కొవిడ్‌ సోకి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆమె, తనకు వైద్యం అందడం లేదని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. కలెక్టర్‌ ఆదేశించినా వైద్యం అందక ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్నుమూసింది. ఈ మరణానికి మీ చేతకాని పాలనే కారణం. ఇప్పటికైనా తాడేపల్లి కొంపలో కూర్చుని ప్రతిపక్షంపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు మానేసి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలన్న దానిపై సమీక్ష చేయండి... మూర్ఖపు ముఖ్యమంత్రి గారూ’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-05-11T09:36:07+05:30 IST