Abn logo
Sep 24 2021 @ 18:30PM

పోలవరంలో అవకతవకలపై సీవీసీకి లోకేష్ ఫిర్యాదు

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవకతవకలపై కేంద్రవిజిలెన్స్ కమిషన్‌కు టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఫిర్యాదు చేసారు. నష్టపరిహారం, పునరావాసంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని లోకేష్  పేర్కొన్నారు. అవకతవకలపై ఆధారాలతో సహా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు, పాస్‌బుక్ నెంబర్లు, చెల్లించిన డబ్బుల వివరాలను ఫిర్యాదులో లోకేష్ పొందుపరిచారు. సాక్ష్యాల ఆధారంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెంటనే విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేసారు.  అవకతవకలపై దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. నకిలీ రెవెన్యూ రికార్డులను సృష్టించి అవకతవకలకు పాల్పడ్డారని లోకేష్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption