నిరాశలో నిరుద్యోగ యువతీ యువకులు: లోకేష్

ABN , First Publish Date - 2021-06-21T17:47:50+05:30 IST

ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు నిరాశ చెందారని లోకేష్ అన్నారు.

నిరాశలో నిరుద్యోగ యువతీ యువకులు: లోకేష్

అమరావతి: ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు నిరాశ చెందారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఓ ఫేక్ ప్రకటన చేశారని విమర్శించారు. వైసీపీ సొంత కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయం పోస్టులు కూడా ఈ ఫేక్ ప్రకటనలో పెట్టారని ఆరోపించారు. ఆర్టీసీలో దశాబ్దాలుగా పని చేస్తున్నవాళ్లని.. ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. వాళ్లకు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నట్లు చూపించారన్నారు. అబద్దాలు చెప్పాలంటే జగన్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో కేవలం 15వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. అది కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో కలిపి అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులను సీఎం జగన్ మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. 

Updated Date - 2021-06-21T17:47:50+05:30 IST