Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలపై వైసీపీ నేతల దాడులకైతే లెక్కేలేదు: లోకేష్

అమరావతి: మహిళలపై వైసీపీ నేతల దాడులకైతే లెక్కేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’’సీఎం జగన్‌రెడ్డి చెల్లెలు తనకు రక్షణ లేదని ఫిర్యాదు చేశారు. సీఎం ఇంటి పక్కన దళితయువతిని మృగాళ్లు గ్యాంగ్ రేప్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళని క్రూరంగా చంపేశారు. కర్నూలు జిల్లా మహానంది మండలం ఆర్ఎస్ గాజుపల్లె గ్రామంలో దళిత కాలనీలో రోడ్డు ఎందుకు వెయ్యరని నిలదీసిన దళిత మహిళపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏ ఒక్క ఘటనలోనూ నిందితులకు శిక్ష పడింది లేదు. ఇక 12 రోజులే మిగిలాయి మాయ మాటలతో కాలక్షేపం మాని ఇచ్చిన హామీ ప్రకారం రమ్య హంతకుడిని ఉరి తియ్యాలి’’ అని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement