Abn logo
Aug 4 2020 @ 22:40PM

మైత్రీ మూవీస్‌లో రామ్ చరణ్ ఫిల్మ్.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ ఇప్పటికే స్టార్ హీరోలందరితో సినిమా చేసింది. మంచి కథాబలమున్న సినిమాలు తీయడంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. రీసెంట్‌గా ఈ సంస్థకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నట్లుగా ఇప్పటికే చెప్పుకున్నాం. టాప్ తెలుగు దర్శకులనే కాకుండా ఇతర భాషల దర్శకులను కూడా ఇప్పుడీ సంస్థ లాక్ చేస్తుందనే టాక్ వినిపిస్తుందని చెప్పుకున్నట్లే కె.జి.యఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ సంస్థ అడ్వాన్స్‌లతో లాక్ చేసేసింది. ఇప్పుడు మరో హిట్ దర్శకుడిని కూడా ఈ సంస్థ లాక్ చేసినట్లుగా టాక్ నడుస్తుందని చెప్పుకున్నాం. అతడెవరో కాదు కార్తీతో ‘ఖైదీ’ అంటూ హిట్ కొట్టి, విజయ్‌ని ‘మాస్టర్’ని చేసిన లోకేష్ కనగరాజ్.


అయితే తాజాగా మరో వార్త.. ఈ సంస్థ విషయమై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో లోకేష్ కనగరాజ్ చేయబోయే చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో అని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈలోపు లోకేష్ ‘ఖైదీ’ సీక్వెల్ పూర్తి చేయనున్నాడు. అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయబోయే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై మైత్రీ మూవీస్ సంస్థ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం?

Advertisement
Advertisement
Advertisement