ఏపీలో పోలీసులు ప్రజారక్షణకు ఉన్నారా?: లోకేష్

ABN , First Publish Date - 2022-01-25T02:33:00+05:30 IST

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్‌ను ఆ పార్టీ నేత నారా లోకేష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు.

ఏపీలో పోలీసులు ప్రజారక్షణకు ఉన్నారా?: లోకేష్

అమరావతి: టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్‌ను ఆ పార్టీ నేత నారా లోకేష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ‘‘గుడివాడలో మంత్రి కొడాలి నాని, కేసినో నడపితే నో పోలీస్. గడ్డం గ్యాంగ్ ప్రతిపక్ష నేతని బూతులు తిడితే నో పోలీస్. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్దా వెంకన్న నిలదీస్తే బిలబిలమంటూ వచ్చి అరెస్ట్ చేశారు. ఏపీలో పోలీసులు ప్రజారక్షణకు ఉన్నారా.. నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా?’’ అని లోకేష్ ప్రశ్నించారు. 


బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. 

Updated Date - 2022-01-25T02:33:00+05:30 IST