Abn logo
Sep 27 2021 @ 02:46AM

ఏపీ డ్రగ్‌ డాన్‌ ఎవరు? : లోకేశ్‌

‘‘తాలిబన్ల డ్రగ్స్‌కు తాడేపల్లి ప్యాల్‌సకి ఉన్న లింకేటి? లిక్కర్‌ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్‌ డెన్‌గా జగన్‌రెడ్డి మార్చేశారు. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్నీ ఏపీ వైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ మాత్రం జగన్‌ భక్తిలో మునిగితేలుతున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘‘డ్రగ్స్‌ డాన్‌ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి ఏపీ పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలి. గుజరాత్‌లో తీగలాగితే విజయవాడలో డొంక కదిలింది. రూ.72వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ని తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్‌ డాన్‌ ఎవరు?’’ అని ఆదివారం ఓ ట్వీట్‌లో లోకేశ్‌ ప్రశ్నించారు.