పంజాబ్‌లో ఆ లాలీపాప్ వర్కౌట్ కాదు: కేజ్రీవాల్‌పై సిద్ధూ

ABN , First Publish Date - 2021-12-07T01:30:12+05:30 IST

అయితే ఢిల్లీలో అమలు అవుతున్న ఉచిత విద్యుత్, స్కూళ్ల నిర్మాణం వెనుక సాధారణ ప్రజల నడ్డే విరుగుతోందని సిద్ధూ విమర్శిస్తున్నారు. ప్రజల అధిక మొత్తంలో పన్నులు వసూలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఇలాంటి లాలీపాప్‌లు పంజాబ్‌లో..

పంజాబ్‌లో ఆ లాలీపాప్ వర్కౌట్ కాదు: కేజ్రీవాల్‌పై సిద్ధూ

చండీగఢ్: ఢిల్లీలో ఇచ్చేటువంటి ‘లాలీపాప్’లు పంజాబ్‌లో ఇస్తామంటే కుదరదని, అక్కడ ఇలాంటివి పని చేయవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఎద్దేవా చేశారు పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ ఎన్నికల్లో మహిళలకు అకౌంట్లలో నెలకు వెయ్యి రూపాయలు వేస్తామని కేజ్రీవాల్ ఎన్నికల హామీ ఇచ్చారు. అంతే కాకుండా పంజాబ్‌లోని స్కూళ్లను ఢిల్లీ స్కూళ్లలాగా మారుస్తామని, విద్యుత్ చార్జీలు కూడా తగ్గిస్తామని హామీలు ఇస్తున్నారు.


అయితే ఢిల్లీలో అమలు అవుతున్న ఉచిత విద్యుత్, స్కూళ్ల నిర్మాణం వెనుక సాధారణ ప్రజల నడ్డే విరుగుతోందని సిద్ధూ విమర్శిస్తున్నారు. ప్రజల అధిక మొత్తంలో పన్నులు వసూలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఇలాంటి లాలీపాప్‌లు పంజాబ్‌లో పని చేయవని అన్నారు. కేజ్రీవాల్ అబద్ధాల కోరని, ప్రజలను మోసగించి అధికారంలోకి రావాలని చూస్తున్నారని సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-07T01:30:12+05:30 IST