ఇంట్లోని పాత వస్తువులను చెత్తలో వేసిన మహిళ .. ఏదో మెరుస్తూ కనిపించింది.. అనుకోకుండా పట్టిన అదృష్టం

ABN , First Publish Date - 2021-11-07T11:44:44+05:30 IST

మనలో చాలా మందికి తమ ఇళ్లలో పాత వస్తువులను స్టోర్ రూంలో దాచుకునే అలవాటు ఉంటుంది. అలా ఆ వస్తువులను కొన్నిసార్లు బయటకు తీసి వాటిలో పనికిరానివి చెత్తలో పడేస్తూ ఉంటాం. కానీ పడేసే ముందు ఒకసారి బాగా చూసుకోవాలి సుమా.. ఎందుకంటే అందులో మనకు తెలియకుండానే ఎంతో విలువైనవి ఉండే అవకాశం ఉంది...

ఇంట్లోని పాత వస్తువులను చెత్తలో వేసిన మహిళ .. ఏదో మెరుస్తూ కనిపించింది.. అనుకోకుండా పట్టిన అదృష్టం

మనలో చాలా మందికి తమ ఇళ్లలో పాత వస్తువులను స్టోర్ రూంలో దాచుకునే అలవాటు ఉంటుంది. అలా ఆ వస్తువులను కొన్నిసార్లు బయటకు తీసి వాటిలో పనికిరానివి చెత్తలో పడేస్తూ ఉంటాం. కానీ పడేసే ముందు ఒకసారి బాగా చూసుకోవాలి సుమా.. ఎందుకంటే అందులో మనకు తెలియకుండానే ఎంతో విలువైనవి ఉండే అవకాశం ఉంది. అలా తెలియక తన విలువైన వస్తువుని చెత్తలో పడేసింది ఒక లండన్ బామ్మ.


లండన్‌కు చెందిన డయానా అనే 70 ఏళ్ల మహిళ ఒక రోజు తన ఇంట్లోని స్టోర్ రూంలో ఉన్న పాత వస్తువులను తీసి వాటిలో కన్ని పనికిరాని వాటిని చెత్తలో పడేసింది. ఆ సమయంలో తన పక్కింట్లో నివసించే స్నేహితురాలు ఆ వస్తువులను గమనిస్తూ ఉంది. ఆమెకు చెత్తలో ఏదో మెరుస్తూ ఉన్నట్లు కనిపించింది. "డయానా.. ఇది ఏంటో ఒకసారి చూడు" అని ఆవిడ చెప్పడంతో.. డయానా దానిని చెత్తలో నుంచి తీయగా అది ఒక ఉంగరం. ఆ ఉంగరంపై ఒక మెరిసే రాయి ఉంది.


ఆ ఉంగరాన్ని 70వ దశకంలో తన భర్త తనకు కానుకగా ఇచ్చాడని చెప్పింది. అప్పడు ఆ పక్కనే ఉన్న స్నేహితురాలు ఆ ఉంగరంలో ఉన్న రాయిని తదేకంగా చూసి దానిని ఒకసారి నగలు షాపులో చూపించమని సలహా ఇచ్చింది. డయానా అయిష్టంగానే ఆమె చెప్పిన దానికి ఒప్పుకుంది. మరుసటి రోజు తనకు తెలిసిన ఒక నగల షాపు ఓనర్ వద్దకు డయానా వెళ్లి తన ఇంట్లో నుంచి తెచ్చిన కొన్ని వస్తువులను అతనికి చూపించింది. అందులో ఆ ఉంగరం కూడా ఉంది.


ఆ షాపు ఓనర్ ఆ వస్తువలన్నీ చూసి ఇందులో ఏవీ పెద్దగా విలువైనవి కావు అని చెప్పాడు. ఆ ఉంగరం మాత్రం ఒకసారి సరిగా పరీక్షించాలి అని అన్నాడు. డయానా అందుకు ఒప్పుకోగా.. ఉంగరాన్ని తన వద్ద ఉంచుకొని ఆమెను రెండు రోజుల తరువాత రమ్మన్నాడు. ఆ ఉంగరాన్ని తన టేబుల్‌పై ఉంచి మరిచిపోయాడు. రెండు రోజుల తరువాత డయానా అక్కడికి రాగా.. ఇంకా ఆ ఉంగరాన్ని పరీక్షించలేదని మరొక రోజు పడుతుందని అన్నాడు. ఆ ఉంగరాన్ని అప్పుడు పరీక్షకు నిపుణుల వద్దకు పంపించగా.. అందులో ఉన్నది ఒక 34 క్యారెట్ల వజ్రం తెలిసింది. దాని విలువ 2 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.20 కోట్లు) అని అంచనా. 


ఈ విషయం డయానాకు తెలియగానే.. ఆమె ఆనందానికి హద్దులు లేవు. తనకు లేటు వయసులో అద‌ృష్టం పట్టిందని ఆమె మురిసిపోయింది. ప్రస్తుతం ఆ వజ్రపు రాయి తొడిగిన ఉంగరాన్ని లండన్‌లోని వజ్రాల హాటన్ గార్డెన్స్‌లో ఉంచారు. నవంబర్ 30న ఆ ఉంగారాన్ని వేలం వేయనున్నారు.


Updated Date - 2021-11-07T11:44:44+05:30 IST