ఆ ప్రాంతానికి వెళితే మీకు చావు అనేదే ఉండదు.. య‌ముడు కూడా మిమ్మ‌ల్ని తాక‌లేడు.. మ‌ర‌ణాల‌ను నిషేధించిన వింత న‌గ‌రం గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2021-10-21T12:40:55+05:30 IST

గత 70 సంవత్సరాలుగా ఏ ఒక్క న‌ర‌మానవుడు కూడా..

ఆ ప్రాంతానికి వెళితే మీకు చావు అనేదే ఉండదు.. య‌ముడు కూడా మిమ్మ‌ల్ని తాక‌లేడు.. మ‌ర‌ణాల‌ను నిషేధించిన వింత న‌గ‌రం గురించి మీకు తెలుసా?

గత 70 సంవత్సరాలుగా ఏ ఒక్క న‌ర‌మానవుడు కూడా మరణించని ప్రదేశం ఈ ప్రపంచంలో ఒక‌టి ఉందని చెబితే మీరు న‌మ్ముతారా? ఈ ప్ర‌శ్న అడిగినప్పుడు అస‌లు ఆ ప్ర‌దేశంలో ప్రజలే ఉండ‌రేమోన‌ని మీరు అనుకునివుంటారు. అయితే ఆ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఇప్ప‌టివ‌ర‌కూ.. అంటే గ‌డ‌చిన 70 ఏళ్ల‌లో ఏ ఒక్క‌రూ కూడా మ‌ర‌ణించ‌లేదు. ప్రపంచ పటంలోప్ర‌త్యేకంగా క‌నిపించే దేశం నార్వే. ఈ దేశంలోని ఒక చిన్న పట్టణమే లాంగ్ ఇయర్ బెన్. ఈ నగరానికి చెందిన‌ పరిపాలనా విభాగం ఒక వినూత్న చట్టాన్ని చేసింది. దీని ప్ర‌కారం ఇక్కడ ఎవరూ మ‌ర‌ణించ‌కూడ‌దు. నగర పరిపాలనా విభాగం ఇక్కడ మానవ మరణాలను పూర్తిగా నిషేధించింది. లాంగ్ ఇయర్ బెన్ నగరం నార్వేలోని ఉత్తర ధృవంలో ఉంది. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా చాలా చల్లగా ఉంటుంది. 



ఈ కారణంగా ఇక్కడ శవం కుళ్లిపోవడమంటూ జ‌ర‌గ‌దు. ఈ నగరంలో ఉష్ణోగ్రతలు అత్యంత క‌నిష్ఠ స్థాయిలో న‌మోద‌వుతుంటాయి. ఈ ఒక్క‌ కారణంతోనే న‌గ‌ర‌ పరిపాలనా విభాగం ఈ ప్రాంతంలో మానవ మరణాలను నిషేధించింది. ఈ నిబంధ‌న‌ గత 70 సంవత్సరాలుగా ఇక్క‌డ అమ‌ల‌వుతోంది. ఫ‌లితంగా ఈ నగరంలో ఒక్క మ‌ర‌ణం కూడా చోటుచేసుకోలేదు. ఈ నగరంలో అధిక సంఖ్య‌లో క్రైస్తవులు నివసిస్తున్నారు. 1917లో ఈ ప్రాంతానికి చెందిన‌ ఒక వ్యక్తి ఇన్‌ఫ్లుయెంజాతో మరణించాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని అప్పుడు నగరంలో ఖననం చేశారు. అయితే ఆ వ్య‌క్తి క‌ళేబ‌రం నుంచి ఇప్పటికీ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు వ్యాపిస్తున్నాయ‌ట‌. ఈ అంటువ్యాధి నుంచి నగర ప్ర‌జ‌ల‌ను రక్షించడానికి ఇక్క‌డి పరిపాలనా విభాగం ఈ ప్రాంతంలో ప్రజలు చనిపోకుండా నిషేధాజ్ఞలు జారీచేసింది. రెండు వేల జనాభా క‌లిగిన ఈ నగరంలో, ఎవ‌రైనా తీవ్ర అనారోగ్యం బారిన‌ప‌డి, చావుబ‌తుకులు మ‌ధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ బాధితుడిని వెంట‌నే మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లిస్తారు. ఆ ప్రాంతంలో బాధితుడు మ‌ర‌ణిస్తే అక్క‌డే ద‌హ‌నం చేస్తారు. తిరిగి ఈ లాంగ్ ఇయర్ బెన్‌  నగరానికి తీసుకురారు.



Updated Date - 2021-10-21T12:40:55+05:30 IST