Abn logo
Sep 10 2021 @ 00:47AM

జ్ఞాన సంపన్నం... లంబోదరుడి రూపం

పిల్లలకు ఇష్టమైన దేవుడు లంబోదరుడు. మొదటి పూజ ఆయనకే చేస్తాం. గణనాథుడు అనగానే పెద్ద చెవులు, తొండం, ఏకదంతం... ఇలా రూపం మనసులో మెదులుతుంది. అయితే ఈ రూపం మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. 


  1. పెద్దతల : ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని సూచిస్తుంది. తెలివితేటలు, జ్ఞానం, సంకల్పం, శక్తికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.
  2. చిన్న కళ్లు : ఏకదంతుడికి ఉండే చిన్న కళ్లు ఏకాగ్రతను ప్రతిబింబిస్తాయి. కళ్లు చిన్నగా ఉన్నా దృష్టి విశాలంగా ఉండాలని చెబుతాయి.
  3. పెద్ద చెవులు : లంబోదరుని పెద్ద చెవులు ఏదైనా శ్రద్ధగా వినమని సూచిస్తాయి. 
  4. తొండం : పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలని, పరిస్థితులకు తగినట్టుగా స్పందించాలని సూచిస్తుంది.
  5. ఏకదంతం : జీవితంలో మంచిని స్వీకరించు, చెడును వదిలేయమని చెబుతుంది.
  6. పెద్ద పొట్ట : జీవితంలో మంచిచెడులు రెండింటినీ ప్రశాంతంగా స్వీకరించాలని చెబుతుంది.

ప్రత్యేకం మరిన్ని...