తప్పులెన్నువారు...

ABN , First Publish Date - 2020-10-16T05:13:17+05:30 IST

చుట్టూ ఉన్నవారిలో లోపాలను ఎంచేవారు ఎక్కువమంది కనిపిస్తూ ఉంటారు. తమలో ఉన్న లోపాలను మాత్రం వారు గుర్తించరు. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్నాడు మహాకవి వేమన...

తప్పులెన్నువారు...

చుట్టూ ఉన్నవారిలో లోపాలను ఎంచేవారు ఎక్కువమంది కనిపిస్తూ ఉంటారు. తమలో ఉన్న లోపాలను మాత్రం వారు గుర్తించరు. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్నాడు మహాకవి వేమన. ఇటువంటి ధోరణి తగనిదని రెండువేల ఏళ్ళ క్రితమే ఏసు ప్రభువు హితవు చెప్పాడు.


‘‘తీర్పులు చెప్పడం మానెయ్యండి. లేకపోతే మీరు కూడా తీర్పులకు గురి కావాల్సి ఉంటుంది. మీరు ఏ కొలతను ఉపయోగిస్తారో, మిమ్మల్ని కూడా అదే కొలతతో కొలుస్తారు. అయినా మీ కళ్ళలో ఉన్న దూలాన్ని గమనించుకోకుండా మీ సోదరుడి కళ్ళలో ఉన్న చిన్న నలుసును ఎందుకు చూస్తున్నారు? మీ కంట్లో అంత పెద్ద దూలాన్ని ఉంచుకొని, ‘‘నీ కంట్లో ఉన్న దూలాన్ని నేను తొలగించనా?’’ అని మీ సోదరుడిని ఎలా అడుగుతారు? కపట వేషధారులారా! ముందర మీ కళ్ళలో ఉన్న దూలాన్ని తొలగించుకోండి. అప్పుడు మీ సోదరుడి కంట్లో ఉన్న నలుసును ఎలా తొలగించాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది’’ (మత్తయి సువార్త 7:1-5) అని హెచ్చరిక చేశాడు.


వేరొకరి ప్రవర్తనల్లో, జీవితాల్లో లోపాలనూ, తప్పులనూ ఎంచడానికి ముందు తమలో ఎలాంటి లోపాలున్నాయో, తమ తప్పులేమిటో అందరూ ఆలోచించుకోవాలి. లోపాలు లేనివారూ, తప్పలు చేయని వారూ ఎవరూ ఉండరు. వాటిని సరిదిద్దుకోవడం మానేసి, ఎదుటివారిని ఎత్తి చూపడం మూర్ఖత్వమనీ, తమ తప్పులను దిద్దుకున్న వారు మాత్రమే ఇతరులను తప్పుల నుంచి కాపాడగలరనీ, వారిని సరిదిద్దగలరనీ తన ఉపదేశం ద్వారా  ఏసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. 

Updated Date - 2020-10-16T05:13:17+05:30 IST