Abn logo
May 11 2021 @ 06:44AM

ఓఆర్‌ఆర్‌పై లారీ బోల్తా

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌ : నగర శివారు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు ఎడమ కాలు, చేయి విరిగాయి. శంషాబాద్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా వరంగల్‌కు కాటన్‌ లోడ్‌ కోసం వెళ్తున్న లారీ పెద్దఅంబర్‌పేట్‌ జంక్షన్‌ ఎగ్జిట్‌ నంబర్‌-11 వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ అతి వేగంగా నడపడంతో అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ శ్రీరామ్‌(34) ఎడమ కాలు, చేయి విరిగిపోయింది. విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.  

Advertisement