గోతులను తప్పించలేక.. కాల్వలోకి..

ABN , First Publish Date - 2021-12-07T04:59:00+05:30 IST

ఇటు చూస్తే అధ్వాన రహదారి.. అటు రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం.. పక్కనే ప్రధాన కాలువ. రెండో వాహనం వస్తే కనీసం తప్పుకునే పరిస్థితి లేని రోడ్డు.

గోతులను తప్పించలేక.. కాల్వలోకి..
ఉండి రైల్వే గేటు వద్ద కాల్వలోకి దూసుకుపోయిన ధాన్యం లోడు లారీ

 ఉండి, డిసెంబరు 6 :  ఇటు చూస్తే అధ్వాన రహదారి.. అటు రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం.. పక్కనే ప్రధాన కాలువ. రెండో వాహనం వస్తే కనీసం తప్పుకునే పరిస్థితి లేని రోడ్డు. వెరసి జంగారెడ్డిగుడెం నుంచి ధాన్యం లోడుతో ఆకివీడు రైస్‌ మిల్‌కు వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి పక్కనే వున్న ఉండి పంట కాల్వలో బోల్తా పడింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో త్రుటిలో బయటప డ్డారు. లారీలోవున్న 24 టన్నుల ధాన్యం తడిచి ముద్దయ్యింది. ఈ ప్రమాదం ఉండి రైల్వే గేటు వద్ద సోమవారం ఉదయం జరిగింది. కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇరిగేషన్‌ అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించారు. క్రేన్‌, కూలీల సహాయంతో ధాన్యాన్ని, లారీని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-07T04:59:00+05:30 IST