Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతను ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఏకైక తమ్ముడు.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు.. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌కు ఓనర్.. అయినా మూడు ముక్కలాటకు బానిసై..

ప్రస్తుతం ఆన్‌లైన్ కార్యకలాపాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని మోసపూరిత సంస్థలు వినియోగదారులను నిలువునా వంచిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఇటువంటి ఉదంతానికి ఒక యువకుడు బలయ్యాడు. ఆ యువకుడు ఆన్‌లైన్‌లో మూడు ముక్కలాట ఆడి, ఏకంగా పది లక్షల రూపాయలు నష్టపోయాడు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన ఆ యువకుడు రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పడోనియా గ్రామంలో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై యువకుని మృతదేహం పడివుండటాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. 

పోలీసులు మృతుడిని వినోద్ దాంగీ(30)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం వినోద్ గత మూడు నెలలుగా తన మొబైల్ ఫోనులో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. దానికి బానిసగా మారిపోయాడు. ఈ ఆట ఆడేందుకు అతను తనకు తెలిసినవారి దగ్గర రూ. 10 లక్షల వరకూ అప్పు చేశాడు. రోజంతా దుకాణంలో కూర్చొని గేమ్ ఆడుతుండేవాడు. వినోద్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అతనికి పెళ్లి అవడంతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం వినోద్ తన ఇంట్లో ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కుటుంబ సభ్యులు అతనిని వారించారు. వినోద్ తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. దీనితో పాటు అతనికి భోపాల్‌లో ఒక బిజినెస్ కాంప్లెక్స్ కూడా ఉంది. దానిలో ఎనిమిది దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ అద్దెకు ఇచ్చారు. వినోద్ ఆ కాంప్లెక్స్ కార్యకలాలను పర్యవేక్షించేవాడు. రోజంతా అక్కడే కూర్చుని మొబైల్ ఫోనులో మూడు ముక్కలాట ఆడేవాడు. ఈ ఆటలో రూ.10 లక్షల వరకూ నష్టపోయాడు. దీంతో తీవ్రంగా కలతచెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement