కరోనా వల్ల రుచి, వాసన ఇలా కోల్పోతాం..

ABN , First Publish Date - 2020-07-08T01:08:34+05:30 IST

కరోనా పెషెంట్‌కు సాధారణ జ్వరం వచ్చినప్పుడు నాలుకపై ఉండే టేస్ట్ నీరసించి పోయి నోటికి రుచి..

కరోనా వల్ల రుచి, వాసన ఇలా కోల్పోతాం..

కరోనా పెషెంట్‌కు సాధారణ జ్వరం  వచ్చినప్పుడు నాలుకపై ఉండే టేస్ట్ నీరసించి పోయి నోటికి రుచి తెలియకుండా పోతుంది. అలాగే బాడీలో వేడి కారణంగా ఏవీ తినబుద్దికాదు. వికారం, వాంతు వచ్చేలా అనిపిస్తుంది. కరోనా విషయంలో అలా జరుగుతుందిలే  అనుకుందామంటే మరో ప్రత్యేక లక్షణం వాటికి జత కలిసింది. రుచి, వికారం మాత్రమే కాదు ... కరోనా పేషెంట్లకు వాసన కూడా తెలియడంలేదు. ఇది కరోనా ప్రారంభ దశలో కనిపిస్తున్న లక్షణాలు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవడం మేలు. వాసన రుచి ఎందుకు తెలియడంలేదనే అంశంపై బ్రిటన్‌లోని సెయింట్ థామస్ హాస్పటల్ డాక్టర్లు పరిశోధన చేశారు. అందులో ఏం తేలిందంటే...వైరస్ ముక్కులోకి వెళ్లిన తర్వాత అక్కడ మంచి బ్యాక్టీరియాతో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో చనిపోయే బ్యాక్టీరియా.. వైరస్‌తో ముక్కు రంధ్రం పూడుకుపోతుంది. ఆ రంధ్రానికి అవతలి వైపున వాసన చూసే న్యూరాలు ఉంటాయి. అందువల్ల కరోనా పేషెంట్ వాసన చూసినా.. ఏ వాసనా తెలియదని డాక్టర్లు తేల్చారు. 

Updated Date - 2020-07-08T01:08:34+05:30 IST