ధాన్యం దిగుమతుల ఆలస్యంతో లారీ యజమానులకు నష్టం

ABN , First Publish Date - 2021-06-23T06:41:22+05:30 IST

ధాన్యం దిగుమతుల్లో ఆలస్యం చేయడంతో లారీ యజమానులకు భారీ నష్టం కలుగుతుందని తెలంగాణ స్టేట్‌ లారీ వెల్ఫేట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ తెలిపారు.

ధాన్యం దిగుమతుల ఆలస్యంతో లారీ యజమానులకు నష్టం
నినాదాలు చేస్తున్న లారీ యజమానులు

వలిగొండ, జూన్‌ 22: ధాన్యం దిగుమతుల్లో ఆలస్యం చేయడంతో లారీ యజమానులకు భారీ నష్టం కలుగుతుందని తెలంగాణ స్టేట్‌ లారీ వెల్ఫేట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ తెలిపారు. లారీ యజమానులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మం గళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వరి ధాన్యం రవాణా చేసే విషయంలో లారీ యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని 2014లో నిర్వహించిన టన్ను ధరల వల్ల యజమానులు నష్టపోతున్నా రన్నారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలకు అనుగుణంగా రేటు ఉండాలి కానీ ఎప్పుడో నిర్ణయించిన రేట్ల ధరల వల్ల లారీ యజ మానులు నష్టపోతున్నారన్నారు. ఒక లారీ నెలకు రూ.90వేల ఫైనాన్స్‌ ఉండడం వల్ల రోజుకు రూ.3వేల చొప్పున కట్టాల్సి ఉంటుందని రోజుల తరబడి గోదాముల వద్ద ఉండడంవల్ల నష్టం కలుగుతోందన్నారు.  

Updated Date - 2021-06-23T06:41:22+05:30 IST