Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోగొట్టుకున్న పర్సు అప్పగింత

తాడిమర్రి, డిసెంబరు 2: మం డలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామం వద్ద రోడ్డుపై పడిపోయిన పర్సును బాధితుడికి అందజేశారు. గురువారం గ్రామానికి చెందిన రాజా యల్లమ్మ తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా అనంతపురం -పులి వెందుల ప్రధానరహదారిపై పర్సు దొరికింది. అందులో జత బంగారు కమ్మలు, కొంత నగదు, పెన్‌డ్రైవ్‌తోపాటు ఏటీఎం కా ర్డులు ఉన్నాయి. పర్సులో ఉన్న ఫోన్‌నెంబర్‌కు సమాచారం అందించి హెచ్‌ఆర్‌సీ మం డల చైర్మన్‌ రాగేరాధిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఏఎస్‌ఐ వన్నప్ప సమక్షంలో బాధితుడు చియ్యేడు నరిసింహారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లమ్మను పోలీ సులు అభినందించారు. కార్యక్రమంలో ఽహెచ్‌ఆర్‌సీ ధర్మ వరం డివిజన్‌ చైర్మన్‌ విశ్వనాథ్‌, వర్కింగ్‌ చైర్మన్‌ జహంగీర్‌బాషా, సాయినాథ్‌, వెంకటేశ్‌, కమతంహరి, సత్యనారాయణ, మారుతి పాల్గొన్నారు.


Advertisement
Advertisement