Advertisement
Advertisement
Abn logo
Advertisement

నష్టపోయాం..ఆదుకోండి

ఎమ్మెల్యేతో రైతుల మొర

అనంతపురంరూరల్‌, నవంబరు 27 : వర్షాలతో అన్నివిధాల నష్టపోయాం.. ఆదుకోండి అని పలువురు రైతులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిని కోరారు. శనివారం మండలంలోని కురుగుంట, కామారుపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో పెట్టుబడి ఎంత పెట్టారు... ఎంత నష్టం వచ్చింది..? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏడీఓ వెంకటరాముడు, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఏఓ వెంకటేశ్వరప్రసాద్‌, మార్కెట్‌ యార్డు చైర్మన గోపాల్‌రెడ్డి, ఎంపీపీ వరలక్ష్మీ, జడ్పీటీసీ చంద్రకుమార్‌, అగ్రిబోర్డు చైర్మన సుబ్బారెడ్డి, మండల కన్వీనర్లు గోవిందురెడ్డి, పవనకుమార్‌, నాయకులు ధనుంజయయాదవ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, ఈశ్వరయ్య, చెన్నారెడ్డి, ఆదినారాయణ ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


Advertisement
Advertisement