లెమన్‌గ్రాస్‌ టీతో లాభాలు బోలెడు!

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

లెమన్‌గ్రాస్‌ టీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే.....

లెమన్‌గ్రాస్‌ టీతో లాభాలు బోలెడు!

లెమన్‌గ్రాస్‌ టీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...

  1.  అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్‌గ్రాస్‌ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. 
  2.  ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
  3.  స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, పొట్ట ఉబ్బరానికి న్యాచురల్‌ రెమిడీగా పనికొస్తుంది.
  4.  రోజూ లెమన్‌గ్రాస్‌ టీ తాగితే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. 
  5.  జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. 
  6.  వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంత క్షయాన్ని అరికడతాయి.
  7. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్‌ టీ ఉపకరిస్తుంది. 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST