Abn logo
Nov 26 2021 @ 04:13AM

43 మద్యం దుకాణాలకు 29న లాటరీ

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తక్కువ దరఖాస్తులు వచ్చిన 43 కొత్త మద్యం దుకాణాలకు టెండర్‌ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్‌ శాఖ గురువారం విడుదల చేసింది. ఈ నెల 29న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జిల్లాల ఎక్సైజ్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పాత దరఖాస్తులతో పాటు కొత్తవాటిని జతచేసి లాటరీ తీస్తారు.