లాటరీలో కారు వచ్చిందని నమ్మించి...

ABN , First Publish Date - 2020-05-11T14:44:07+05:30 IST

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లో లాటరీ వచ్చిందని నమ్మించి

లాటరీలో కారు వచ్చిందని నమ్మించి...

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లో లాటరీ వచ్చిందని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ. 1.21 లక్షలు కాజేశారు. కారు పంపిస్తున్నామంటూ మాయమాటలు చెప్పి జీఎ్‌సటీ సర్వీస్‌ ట్యాక్స్‌ అంటూ పలు దఫాలుగా అతడి నుంచి డబ్బు వసూలు చేశారు. ఆసి్‌ఫనగర్‌ ప్రాంతానికి చెందిన యువకుడికి కొన్ని రోజుల క్రితం ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. షాప్‌క్లూస్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మీకు లాటరీ వచ్చిందని, బహుమతిగా రూ. 6.20 లక్షల విలువైన టాటా కారు గెలుపొందారని ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పాడు.


కారు కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజ్‌ కింద రూ. 3 వేలు చెల్లించాలన్నాడు.  నమ్మిన యువకుడు అతడు చెప్పిన ఖాతాలో నగదు జమచేశాడు. అనంతరం జీఎ్‌సటీ, సర్వీ్‌సట్యాక్స్‌, షిప్పింగ్‌ చార్జీ అంటూ పలు దఫాలుగా యువకుడి నుంచి రూ. 1,21,200 వసూలు చేశారు. కారు పంపించకపోవడం, ఇంకా డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-05-11T14:44:07+05:30 IST