పక్కింట్లో పదేళ్ల అజ్ఞాత ప్రేమాయణం!

ABN , First Publish Date - 2021-06-10T08:33:22+05:30 IST

ఆ టీనేజర్‌.. పదేళ్ల క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడెక్కడో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఆశలు

పక్కింట్లో పదేళ్ల అజ్ఞాత ప్రేమాయణం!

ప్రియుడితో కలిసి ఒకే గదిలో ప్రియురాలు..

గుర్తించలేకపోయిన తల్లిదండ్రులు


పాలక్కాడ్‌ (కేరళ), జూన్‌ 9: ఆ టీనేజర్‌.. పదేళ్ల క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడెక్కడో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఆశలు వదిలేసుకున్నారు. ఈ క్రమంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ అమ్మాయి దొరికింది’ అని చెప్పారు. తీరా వెళ్లే సరికి ఆ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. అతడ్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అతడు తమ పక్కింటి కుర్రాడే. ఆ అమ్మాయి మరెక్కడికో లేచిపోలేదు! పక్కింటికే వెళ్లింది. ఇన్ని సంవత్సరాలు అక్కడే గడిపింది. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. ఆ అబ్బాయి.. తన పక్కింటి ప్రియురాలిని.. ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో.. తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే.. లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట!  మూడు నెలల క్రితం ఆ అబ్బాయి.. గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేసేవాళ్లు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. 

Updated Date - 2021-06-10T08:33:22+05:30 IST