Abn logo
Sep 24 2021 @ 00:56AM

ఉప ఎన్నిక వస్తేనే దళితులపై సీఎంకు ప్రేమ

సమావేశంలో మాట్లాడుతున్న సత్యం

ఫటీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం

మల్యాల, సెప్టెంబరు 23: సీఎం కేసీఆర్‌ దళితులను అనేక సార్లు మోసం చేశారని, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాగానే దళితులపై మళ్లీ ప్రేమ పుట్టుకువచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మల్యాల మండల కేంద్రంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సత్యం మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌కు ఉం టే దళితులందరికీ దళిత బంధు అందించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గల దాదాపు 50వేల కుటుం బాలకు వెంటనే పథకాన్ని వర్తింపజేయాలన్నారు. ఏడేళ్లుగా గుర్తుకురాని దళితులు ఉప ఎన్నికతో గుర్తుకు వచ్చారని ఇప్పటికైనా దళితులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక తొలి ముఖ్య మంత్రి దళితుడే అని చెప్పి దళితులను సీఎం కేసీఆర్‌ మోసం చేశాడన్నారు. ఇప్పుడు దళిత బంధు కూడా అంతేనని పేర్కొన్నారు. దళితులకు భాసటగా నిలిచింది కాంగ్రెస్‌ అని త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రానుందని పేర్కొన్నారు. దళితులకు న్యాయం జరిగేవరకు, భూపంపిణీ, ఉద్యోగాలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వచ్చే వరకు వారి తరపున పోరాడుతామని తెలిపారు. పూడూర్‌లో ఖాదీ బోర్డుకు చెందిన రూ.12 కోట్ల విలువైన భూమిని అధికార పార్టీ నాయకులు రూ.1.25 కోట్లకే కాజేయాలని చూసారని తమ పోరాటంతో అది నిలిచి పోందని అన్నారు. ఈ సమావేశంలో వెల్మ లక్ష్మారెడ్డి, శోభరాణీ, ఆదిరెడ్డి, ఆనందరెడ్డి పద్మ, శంకర్‌, లక్ష్మణాచారి, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఇమామ్‌, విక్రం పాల్గొన్నారు. అంతకు ముందు మల్యాల అంగడి బజార్‌ నుంచి బ్లాక్‌ చౌరస్తా వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.