లవ్ జిహాద్ అనేది రాజకీయం మాత్రమే: శశిథరూర్

ABN , First Publish Date - 2021-04-01T23:51:42+05:30 IST

ప్రజల జీవితాలు వారు కోరుకున్న విధంగా ఉండనివ్వండి. మన దేశం, ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా? రాజ్యాంగం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కానీ ‘లవ్ జిహాదీ’ అని అధికార పార్టీవాళ్లు చాలా పెద్ద హడావుడి చేస్తున్నారు

లవ్ జిహాద్ అనేది రాజకీయం మాత్రమే: శశిథరూర్

తిరువనంతపురం: లవ్ జిహాద్ అనేది అసంబద్ధమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ దుయ్యబట్టారు. లవ్ జిహాదీపై ఇప్పటి వరకు ఎన్నికేసులు నమోదు చేయబడ్డాయో, వాటి ప్రాతిపదిక ఏంటో వివరించగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. గురువారం కేరళ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమై హక్కులు ఉన్నాయి. వారు ఏం తినాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని పూజించాలో రాజకీయ నేతలు చెప్పడం ఏంటని థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘ప్రజల జీవితాలు వారు కోరుకున్న విధంగా ఉండనివ్వండి. మన దేశం, ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా? రాజ్యాంగం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కానీ ‘లవ్ జిహాదీ’ అని అధికార పార్టీవాళ్లు చాలా పెద్ద హడావుడి చేస్తున్నారు. నిజానికి లవ్ జిహాదీ అనేది అసంబద్ధమైంది. లవ్ జిహాదీపై ఇప్పటి వరకు ఎన్నికేసులు నమోదు చేయబడ్డాయో, వాటి ప్రాతిపదిక ఏంటో వివరించగలరా? ఇది పూర్తిగా మతత్వవాదం. ప్రజల అభిప్రాయాలను ఇది వక్రీకరిస్తోంది, తప్పుదారి పట్టిస్తోంది. లవ్ జిహాదీ అనేది ఈ దేశ సంస్కృతి కాదు, విదేశాలకు సంబంధించినదై ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. కానీ రాజకీయ నాయకులు ప్రజలను నియంత్రించాలని చూస్తున్నారు. ప్రజలు ఏం తినాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని పూజించాలో రాజకీయ నేతలు చెప్పడం ఏంటి?’’ అని శశిథరూర్ ప్రశ్నించారు.

Updated Date - 2021-04-01T23:51:42+05:30 IST