Abn logo
Aug 8 2021 @ 17:35PM

ప్రేమించి పెళ్లి చేసుకున్నారని బంధువుల దాడి

ప.గో.జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఓ జంటపై యువతి బంధువులు దాడి చేశారు. మనస్థాపంతో యువకుడు పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళితే.. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో యువతి గుర్గా భవాని, యువకుడు షఫీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. వారిపై దాడి చేసి, దుర్గాభవానిని బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు షఫీ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిడ్నా‌ప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నా‌ప్‌కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. దుర్గాభవానిని లక్కవరం స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు.