Sep 26 2021 @ 08:25AM

Love Story: నాగ చైతన్యకు అమల అక్కినేని శుభాకాంక్షలు

నాగ చైతన్యకు.. అమల అక్కినేని శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరి'. ఈవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కరోనా వేవ్స్‌ను తట్టుకొని పలు వాయిదాల తర్వాత థియేటర్స్‌లో విడుదలై మొదటిరోజే ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సతీమణి అక్కినేని అమల చైతుకు ట్వీట్ చేశారు. "నీ 'లవ్ స్టోరి'కి ప్రేక్షకులనుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరింత పాజిటివ్ టాక్‌తో భారీ సక్సస్ అందుకోవాలని కోరుతున్నాను.. ఆల్ ది బెస్ట్ చై" అని తాజాగా చేసిన ట్వీట్‌లో అమల పేర్కొన్నారు. కాగా ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందించగా, నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు.