ఇద్దరితో ప్రేమ..పెళ్లి!

ABN , First Publish Date - 2021-06-19T08:39:16+05:30 IST

ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు, విషయం బయటకు పొక్కేసరికి తనకు ఇద్దరూ ఇష్టమని, ఇద్దరినీ పెళ్లాడతానని చెప్పాడు.

ఇద్దరితో ప్రేమ..పెళ్లి!

  • ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం 
  • ఒకే మండపంలో యువతులకు తాళి కట్టిన యువకుడు


ఉట్నూర్‌, జూన్‌ 18: ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు, విషయం బయటకు పొక్కేసరికి తనకు ఇద్దరూ ఇష్టమని, ఇద్దరినీ పెళ్లాడతానని చెప్పాడు. అతడి ప్రతిపాదనకు తల్లిదండ్రుతో పాటు ఇద్దరు అమ్మాయిల తరఫువారు కూడా అంగీకరించారు! దీంతో ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలనూ మనువాడాడు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం ఘన్‌పూర్‌ గ్రామంలో ఇటీవల ఈ పెళ్లి జరిగింది. గ్రామానికి చెందిన అర్జున్‌ డీఎడ్‌ పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు కోసం సిద్ధమవుతూనే తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న తన మేనత్త కూతురు ఉషారాణిని అర్జున్‌  ప్రేమించాడు. కొన్నాళ్లకు సమీప గ్రామమైన శంభుగూడకు చెందిన సూర్యకళతోనూ ప్రేమాయణం నడిపాడు. తమతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని యువతులకు తెలిసింది. ఇది పెద్దలదాకా వెళ్లింది. అర్జున్‌ గ్రామ పెద్దలను కలిసి ఇద్దరమ్మాయిలనూ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ నెల 14న ఘన్‌పూర్‌లో గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఉష, సూర్యకళను అర్జున్‌ పెళ్లాడాడు.  



Updated Date - 2021-06-19T08:39:16+05:30 IST