ప్రేమించిన యువతి సోదరుడితో ఘర్షణ.. బెదిరింపులు

ABN , First Publish Date - 2021-02-20T13:35:44+05:30 IST

తాను ప్రేమించిన యువతి సోదరుడిని బొమ్మ తుపాకీతో బెదిరించాడు

ప్రేమించిన యువతి సోదరుడితో ఘర్షణ.. బెదిరింపులు

హైదరాబాద్/జవహర్‌నగర్‌ : తాను ప్రేమించిన యువతి సోదరుడిని బొమ్మ తుపాకీతో బెదిరించాడు ఓ యువకుడు. బాధితుడి సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఓ యువతి దమ్మాయిగూడలోని లేక్‌ వ్యూ కాలనీలో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న అభిషేక్‌(20) ఆ యువతిని ఇష్టపడుతున్నాడు. శుక్రవారం యువతి సోదరుడు భానుప్రకా‌ష్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌ వద్దకు రమ్మని అభిషేక్‌ పిలిచి బొమ్మ తుపాకీతో బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన భానుప్రకాష్‌ వెంటనే జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అభిషేక్‌ కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌(ఫ్లి్‌పకార్ట్‌) ద్వారా ఎయిర్‌గన్‌ను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అనిల్‌ తెలిపారు.

Read more