నేను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించా.. అంటూ ఆ భార్య అసలు నిజం చెప్తే అదంతా మర్చిపో అన్నాడా భర్త.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-30T00:52:55+05:30 IST

పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తుల గురించి భార్యాభర్తలు దాదాపు ఒకరికొకరు చెప్పుకోరు. కానీ హర్యానాలో జరిగిన ఘటన అందుకు

నేను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించా.. అంటూ ఆ భార్య అసలు నిజం చెప్తే అదంతా మర్చిపో అన్నాడా భర్త.. ఆ తర్వాత..

పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తుల గురించి భార్యాభర్తలు దాదాపు ఒకరికొకరు చెప్పుకోరు. కానీ హర్యానాలో జరిగిన ఘటన అందుకు విరుద్ధంగా ఉంది. నేను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించానంటూ ఆ భార్య అసలు నిజం భర్తకు చెప్పింది. అపుడు భర్త అదంతా పెళ్లికి ముందు కదా.. ఇపుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అంతా మర్చిపో అన్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


కర్నల్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల అమన్‌దీప్‌కు అంబాల ప్రాంతానికి చెందిన రవీంద్ర కౌర్‌తో 2016లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసున్న పాప కూడా ఉంది. అయితే రవీంద్ర కౌర్‌ అంబాలలోని స్కూల్‌లో చదువుతున్నపుడు సన్నీ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో రవీంద్ర అమన్‌దీప్‌ను పెళ్లి చేసుకుంది. అయినా కూడా ఆమె సన్నీని మర్చిపోలేకపోయింది. ఓ రోజు భర్తకు అసలు నిజం చెప్పేసింది. అపుడు భర్త అదంతా మర్చిపో అని హెచ్చరించాడు. అయితే ఆమె ప్రియుడిని మర్చిపోలేక.. రహస్యంగా అతడితో ఫోన్ మాట్లాడేది. గమనించిన అమన్ భార్యను చాలాసార్లు హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రవీంద్ర కౌర్ భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి అమన్‌దీప్‌ హత్యకు పథకం వేసింది. 


నవంబర్ 24న అంబాలలో జరిగిన రవీంద్ర కౌర్ సోదరి పెళ్లికి అమన్‌దీప్ తన బైక్‌పై వెళ్లాడు. సన్నీ కూడా ఆ పెళ్లికి హాజరయ్యాడు. రవీంద్ర తన ప్రియుడిని బంధువుగా భర్తకు పరిచయం చేసింది. ఆ రోజు రాత్రి అమన్‌దీప్‌ను సన్నీ పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితుడిని కూడా పిలిచాడు. అమన్‌కు ఫుల్‌గా మద్యం తాగించి అతడు స్పృహ తప్పాక తలపై బలంగా మోది హత్య చేశారు. గురువారం నాడు పోలీసులకు రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహం లభించింది. అక్కడే అతడి బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-11-30T00:52:55+05:30 IST