పెళ్లయిన రెండు వారాలకే షాకింగ్ న్యూస్.. భర్త వద్ద నిజం దాచామని బాంబు పేల్చిన భార్య.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-09-17T21:04:19+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. వారి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించకపోవడంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయారు..

పెళ్లయిన రెండు వారాలకే షాకింగ్ న్యూస్.. భర్త వద్ద నిజం దాచామని బాంబు పేల్చిన భార్య.. అసలు కథేంటంటే..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. వారి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించకపోవడంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.. ఓ సంస్థ ఆధ్వర్యంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.. అనంతరం తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు.. అక్కడ అసలు విషయం బయటపడింది.. వధువు మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకుందని తేలింది.. కోర్టునే కాకుండా భర్తను కూడా మోసం చేసినట్టు యువతి అంగీకరించింది.. హర్యానాలోని హిసార్‌లో ఈ ఘటన జరిగింది. 


హర్యానాలోని హిసార్‌కు చెందిన ప్రేమ జంట ఈ నెల మూడో తేదీన రివాజ్ వివాహ సేవా సమితి ఆధ్వర్యంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. వధువుకు అప్పటికి 16 సంవత్సరాలే కావడంతో ఆమె తన 21 ఏళ్ల సోదరి ఆధార్ కార్డును సమర్పించింది. తన సోదరి పేరునే తన పేరుగా పేర్కొంది. రిజిస్టర్‌లో ఆమె పేరు మీదే సంతకం చేసింది. అనంతరం తమ కుటుంబాల నుంచి రక్షణ కావాలంటూ ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. 


ఇవి కూడా చదవండి

ATM లోంచి రూ.15 వేలు తీయబోయిన మహిళకు షాక్..



మహిళా SIకూ తప్పని లైంగిక వేధింపులు.. స్టేషన్‌లోనే..


న్యాయమూర్తి ఇరు కుటుంబాల వారిని పిలిచినప్పుడు అసలు విషయం బయటపడింది. తన కూతురు వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని ఆమె తండ్రి చెప్పాడు. ఆమె ఆధార్ కార్డును కూడా అందించాడు. దీంతో సెషన్స్ కోర్టు రీడర్ వధువు, వరుడిపై కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, మైనార్టీ వివాహ చట్టాల కింద కేసు నమోదు చేసుకున్నారు. అయితే తన నిజమైన వయసు తన భర్తకు తెలియదని ఆమె విచారణ సందర్భంగా చెప్పింది. 

Updated Date - 2021-09-17T21:04:19+05:30 IST