Lucknow నుంచి Hyderabad లో చికిత్సకు మహిళా డాక్టర్‌

ABN , First Publish Date - 2021-07-12T14:16:46+05:30 IST

లక్నో నగరంలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పీజీ రెసిడెంట్‌ వైద్యురాలు...

Lucknow నుంచి Hyderabad లో చికిత్సకు మహిళా డాక్టర్‌

  • ఊపిరితిత్తుల మార్పిడికి కిమ్స్‌కు తరలింపు


హైదరాబాద్‌ సిటీ : లక్నో నగరంలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన పీజీ రెసిడెంట్‌ వైద్యురాలు శారద సుమన్‌ను ఊపిరితిత్తుల మార్పిడి కోసం నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్‌ 14న ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెకు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భిణి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ చికిత్స అందించి మే 1న అత్యవసర సీజేరియన్‌ నిర్వహించి బిడ్డను కాపాడారు. ప్రసవం తర్వాత డాక్టర్‌ శారద సుమన్‌కు ఎక్మో సపోర్ట్‌ చికిత్స అందించారు. ఈ చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ఆమెను మరోసారి పరిశీలించిన వైద్య బృందం ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని నిర్ధారించారు. 


మార్పిడికి అయ్యే ఖర్చును భరించగలిగే స్థితిలో కుటుంబం లేకపోవడంతో డాక్టర్‌ నిత్యానంద్‌ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో సీఎం శస్త్రచికిత్సకు అవసరమైన రూ.1.5 కోట్లను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఊపిరితిత్తుల మార్పిడి కోసం హైదరాబాద్‌, చెన్నై, నగరాల్లోని నాలుగు ఆస్పత్రులను ఉత్తరప్రదేశ్‌ వైద్య బృందం సంప్రందించింది. చివరకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో మార్పిడి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెను ఆర్‌ఎంఏఎల్‌ఐఎంఎస్‌ నుంచి లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ ద్వారా లక్నో విమానాశ్రయం నుంచి, అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు డాక్టర్‌ శరదాను తరలించారు.

Updated Date - 2021-07-12T14:16:46+05:30 IST