Advertisement
Advertisement
Abn logo
Advertisement

లక్కు ఎవరికో..

యాదాద్రి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి)/సూర్యాపేటక్రైం, రామగిరి: మద్యం నూతన దుకాణాలను ఈ నెల 20న లాటరీ విధానంలో అధికారులు కేటాయించనున్నారు. అందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, లాటరీలో లక్కు ఎవరిని వరిస్తోందనని వ్యాపారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ రాత్రివరకు ఎక్సైజ్‌ శా ఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించగా, వాటిని శుక్రవారం పరిశీలించారు. యాదాద్రి జిల్లాలో 82దుకాణాలకు 1379 దరఖాస్తులు వచ్చాయి. 

అందులో ఏడాదికి రూ.50లక్షల స్లాబ్‌ ఉన్న దుకాణాలు 20, రూ.55లక్షల స్లాబ్‌ దుకాణాలు 46, రూ.60లక్షల స్లాబ్‌ ఉన్న దుకాణాలు 16 ఉన్నాయి. ఎస్సీలకు ఏడు, ఎస్టీలకు ఒకటి, గౌడ సామాజికవర్గానికి 21 దుకాణాలను రిజర్వ్‌ చేశారు. భువనగిరిలోని రావిభద్రారెడ్డి ఫంక్షన్‌ హాల్లో ఉదయం 11గంటల నుం చి లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులందరికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు ఎంట్రీ పాస్‌ జారీ చేశారు. తొలుత భువనగిరి సర్కిల్‌ పరిధిలోని 1నుంచి 27వ దుకాణం వరకు లాటరీ తీస్తారు. అనంతరం చౌటుప్పల్‌ సర్కిల్‌లోని 28 నుంచి 45 దుకాణం వరకు, ఆ తరువాత రామన్నపేట సర్కిల్‌ పరిధిలోని 46 నుంచి 67వ దుకాణం వరకు, అనంతరం ఆలేరు సర్కిల్‌లోని 46 నుంచి 67దుకాణం వరకు లాటరీ నిర్వహిస్తారు. చివరగా మోత్కురు సర్కిల్‌ పరిధిలోని 68నుంచి 82వ దుకాణం వరకు లాటరీ తీస్తారు. మద్యం దుకాణా లు పొందిన వ్యాపారులు ఈఎంఐ చెల్లించేందుకు బ్యాంకర్లతో ప్రత్యేకంగా కౌం టర్లు ఏర్పాటు చేశారు. కాగా, ఏర్పాట్లును కలెక్టర్‌ పమేలా సత్పథి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, ఎక్సైజ్‌శాఖ జిల్లా అఽధికారి కృష్ణప్రియ పరిశీలించారు.

సూర్యాపేట జిల్లాలో మొత్తం 99 దుకాణాలకు 3017 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 9 గంటల నుం చి లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీ నుం చి 2023 నవంబరు వరకు లైసెన్స్‌ కాలపరిమితిని ఉండనుంది. కాగా, ఏర్పాట ్లను కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు.

నల్లగొండ జిల్లాలో 155 దుకాణాలకు 4079 దరఖాస్తులు వచ్చాయి. పట్టణంలోని గంధంవారి రోడ్డులోని జీఎం కన్‌వెన్షన్‌ హాల్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. 155 దుకాణాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి 14, ఎస్టీలకు నాలుగు, గౌడ సామాజికవర్గానికి 34 దుకాణాలు రిజర్వ్‌చేశారు.  

Advertisement
Advertisement