పెళ్లయిన మూడేళ్ల తర్వాత భర్తకు ఝలక్.. దేశం దాటగానే మాట మార్చిన భార్య..!

ABN , First Publish Date - 2021-06-20T02:52:30+05:30 IST

కెనడాలో స్థిరపడాలనేది అతని కల.. అయితే అతనికి వీసా వచ్చే అవకాశాలు లేవు.. దీంతో ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఖర్చుతో ఆమెను పై చదువుల కోసం కెనడా పంపించాడు.. అనంతరం ఫ్యామిలీ వీసాపై అతను

పెళ్లయిన మూడేళ్ల తర్వాత భర్తకు ఝలక్.. దేశం దాటగానే మాట మార్చిన భార్య..!

కెనడాలో స్థిరపడాలనేది అతని కల.. అయితే అతనికి వీసా వచ్చే అవకాశాలు లేవు.. దీంతో ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఖర్చుతో ఆమెను పై చదువుల కోసం కెనడా పంపించాడు.. అనంతరం ఫ్యామిలీ వీసాపై అతను కూడా అక్కడికి వెళ్లిపోవాలనుకున్నాడు.. అయితే దేశం దాటక అతని భార్య మాట మార్చింది.. విడాకులు ఇస్తున్నానని చెప్పి షాకిచ్చింది. 


లూథియానాకు చెందిన జస్కరణ్ సింగ్ 2018లో గుర్లీన్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ముందు స్టడీ వీసా సంపాదించి ఆమెను పై చదువుల కోసం కెనడా పంపిస్తానని, అందుకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని, ఆమె కెనడా వెళ్లాక ఫ్యామిలీ వీసా మీద తనను కూడా అక్కడకు తీసుకెళ్లాలని షరతు విధించాడు. ఆ షరతుకు అంగీకరించి పెళ్లి చేసుకుని, కెనడా వెళ్లిన గుర్లీన్ మాట మార్చింది. విడాకులు ఇస్తున్నట్టు నోటీసు పంపించింది. దీంతో గుర్లీన్‌పై, ఆమె కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో జస్కరణ్ ఛీటింగ్ కేసు పెట్టాడు. 


`విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు కచ్చితంగా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్) పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఆ సామర్థ్యం లేని వారు ఇలా బాగా చదువుకునే అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి ఖర్చంతా భరించి స్టడీ వీసా మీద విదేశాలకు పంపిస్తారు. వారు అక్కడకు వెళ్లి స్పౌస్ (భాగస్వామి) వీసా అప్లయ్ చేసి భర్తను అక్కడకు తీసుకెళ్లాలి. ఇలా పంజాబ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు అక్కడకు వెళ్లాక మాట మార్చి ముందు అనుకున్న షరతును ఉల్లంఘిస్తుంటార`ని లూథియానా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చరణ్‌జీత్ సింగ్ తెలిపారు. 


Updated Date - 2021-06-20T02:52:30+05:30 IST