నేడే చంద్రగ్రహణం

ABN , First Publish Date - 2020-06-05T07:09:26+05:30 IST

ఈ రోజు చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ఈ రోజు రాత్రి 11:15 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2.34 గంటలకు ముగుస్తుంది. మొత్తం 3 గంటల 19 నిమిషాల పాటు కొనసాగుతుంది...

నేడే చంద్రగ్రహణం

న్యూఢిల్లీ జూన్‌ 4: ఈ రోజు చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ఈ రోజు రాత్రి 11:15 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2.34 గంటలకు ముగుస్తుంది. మొత్తం 3 గంటల 19 నిమిషాల పాటు కొనసాగుతుంది. రాత్రి 12.54 నిమిషాలకు పూర్తి స్థాయిలో దీన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో కూడా ఈ గ్రహణాన్ని చూడొచ్చు.  నేడు ఏర్పడేది పెనంబ్రల్‌ చంద్రగ్రహణం. ఈ సంవత్సరం ఏర్పడే రెండో చంద్రగ్రహణం ఇది. ఈ ఏడాది జనవరి 10న మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. పాక్షిక చంద్రగ్రహణాలను కంటితో చూడొచ్చు. ఇటువంటి వాటిని మాత్రం బైనాక్యులర్‌ లేదా టెలిస్కో్‌పతో చూడటం మంచిది.  


Updated Date - 2020-06-05T07:09:26+05:30 IST