చిన్నారులకు ‘మధ్యాహ్న భోజన’ కష్టాలు

ABN , First Publish Date - 2021-12-03T06:10:42+05:30 IST

మండ ల కేంద్ర సమీపంలోని ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యా హ్న భోజనం కోసం అవస్థలు పడుతు న్నారు.

చిన్నారులకు ‘మధ్యాహ్న భోజన’ కష్టాలు
పిచ్చిమొక్కల నడుమ భోజనం చేస్తున్న సీకేపల్లి ఎస్టీ కాలనీ విద్యార్థులు







చెన్నేకొత్తపల్లి, డిసెంబరు2: మండ ల కేంద్ర సమీపంలోని ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యా హ్న భోజనం కోసం అవస్థలు పడుతు న్నారు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 20మంది విద్యార్థులు చదువుకుం టున్నా రు. పాఠశాలకు సంబంధించి భోజన ఏజేన్సీ వారు మూడు నెలల క్రితం మానుకోవడంతో తాత్కాలికంగా సమీపంలో ఉన్న ఆదర్శ పాఠ శాలలో వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అయితే  ప్రాథమి క పాఠశాలలో మధ్యాహ్నం గం. 12.10కు భోజనం అందిస్తారు. ఆదర్శపాఠశాలలో  మధ్యాహ్నం ఒంటి గంటకు అందిస్తారు. దీంతో  ఫర్లాంగు దూరంలోని ఆదర్శ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి... చె ట్లకింద కూర్చొని ఎప్పుడు భోజనం పెడతారా... అని ఖాళీ ప్లేట్లను చే త పట్టుకుని ఎదురుచూడటం ఆ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ని త్యకృత్యమైంది. దాదాపు 3 నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొందని... పైగా ఆదర్శ పాఠశాల ఆవరణంలో ఆరు బయట పిచ్చి మొక్కలు, ఇతర తీవ్ర అపరిశుభ్రత నడుమ ప్రతి రోజూ  పిల్లలు భోజనం చే యాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సమ స్యపై హెచఎం రవీంద్రారెడ్డిని ఆరాతీయగా... ఏజెన్సీ నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. పి ల్లలకు మధ్యాహ్న భోజన సమస్య రాకుండా తాత్కాలికంగా ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. సమస్యను మండల విద్యాశాఖాధికారి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు.

శింగనమల : మండలంలోని నాయనవారిపల్లి ప్రాథమిక పాఠశా లలో  1వ తేదీ నుంచి 5వ తరగతి వరకూ 30 మంది విద్యా ర్థులు ఉన్నారు. గతంలో ఉన్న మధ్యాహ్న భోజనాన్ని ఏజెన్సీ నిర్వాహకురా లు అర్థాంతరంగా మానేసింది. అప్పటి నుంచి సుమారు మూడు వారాలుగా ఆ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్‌ అయింది. దీంతో పలువురు విద్యార్థులు ఇంటి నుంచి రోజూ క్యారే జీలు తీసుకొచ్చి ఇక్కడ భోజనం తింటున్నారు.   చాలా మంది విద్యా ర్థులు ఉదయం ఇంట్లో తిని వచ్చిన భోజనంతో సాయం త్రం 4 గం టల వరకూ కడుపు కాల్చుకుంటున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్య మే నని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంఈఓ ను అడు గగా... ఇక్కడ ఏజెన్సీ నిర్వాహకురాలు మూడు వారాల కిందట అర్ధాం తరంగా  మానేసిందన్నారు. అప్పటి నుంచి స్థానిక సర్పంచ, ఉపాఽ ధ్యాయులు, మేము కొత్త ఏజెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మధ్యా హ్నం భోజనం ద్వారా కనీసం కూలీ కూడా రాదంటూ ఎవరూ ఆసక్తి చూపడం లేదని, రెండు రోజుల్లోగా కొత్త వారిని ఏర్పాటు చేస్తామన్నారు. 




  



Updated Date - 2021-12-03T06:10:42+05:30 IST