పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-01-18T08:51:00+05:30 IST

ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. మధ్యాహ్న భోజన వంట గది

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మార్గదర్శకాలు

వంట గది, సామగ్రి శుభ్రంగా ఉండాలి


హైదరాబాద్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. మధ్యాహ్న భోజన వంట గది ప్రాంతాలు, భోజన ప్రదేశం, వినియోగించే వస్తు సామగ్రిని శుభ్రంగా ఉంచాలని పేర్కొంది. బియ్యం, ఇతర నిత్యవసరాలు తాజావి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. వంట గదిలోనూ భౌతిక దూరం పాటించాలని, అక్కడ పని చేసేవారు మినహా.. ఇతరులను రానివ్వవద్దని పేర్కొంది. విద్యార్థులు భోజనం సందర్భంగా గుమిగూడకుండా చూడాలని, నీటి కుళాయిల వద్ద కూడా భౌతిక దూరం పాటించేలా చూడాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే జరుగుతున్న విషయం తెలిసిందే. నిబంధనలు పాటిస్తూ 9, 10 తరగతుల వారికి ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్‌ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతించింది.

Updated Date - 2021-01-18T08:51:00+05:30 IST