ఊపిరితిత్తుల వ్యాధులకు వాడే ఔషధంతో ‘కరోనా’ చికిత్స

ABN , First Publish Date - 2020-04-05T07:35:51+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా ప్రభావితమవుతున్నది రోగుల శ్వాసకోశ వ్యవస్థే. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వ్యాధుల కట్టడికి అభివృద్ధిచేస్తున్న ‘ఏపీఎన్‌01’ అనే ఔషధాన్ని...

ఊపిరితిత్తుల వ్యాధులకు వాడే ఔషధంతో ‘కరోనా’ చికిత్స

టొరంటో, ఏప్రిల్‌ 4: కరోనా ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా ప్రభావితమవుతున్నది రోగుల శ్వాసకోశ వ్యవస్థే. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వ్యాధుల కట్టడికి అభివృద్ధిచేస్తున్న ‘ఏపీఎన్‌01’ అనే ఔషధాన్ని కొవిడ్‌-19కు విరుగుడుగా వాడొచ్చని కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా వర్సిటీ, స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. కరోనా ఇన్ఫెక్షన్‌ను తొలి దశలోనే అడ్డుకట్ట వేసేంత ప్రభావవంతంగా ఏపీఎన్‌01 పనిచేస్తుందని ప్రాథమిక ప్రయోగ పరీక్ష ల్లో గుర్తించామని వెల్లడించారు. దీనికి శరీరంలోని కణాలు, శ్వాసకోశ వ్యవస్థ, ఇతర అవయవాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయన్నారు. ఈ ఔషధాన్ని ఆస్ట్రియా దేశానికి చెందిన ‘ఎపీరియాన్‌ బయాలజిక్స్‌’ అభివృద్ధిచేసింది. త్వరలో ఏపీఎన్‌01తో చైనాలోని కరోనా రోగులపై పరీక్షలు నిర్వహించనుంది. 

Updated Date - 2020-04-05T07:35:51+05:30 IST