రైతులు, మహిళలకు దగా

ABN , First Publish Date - 2022-01-29T05:58:38+05:30 IST

ప్రభుత్వం మహిళలు, రైతులను దగాకు గురిచేస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.

రైతులు, మహిళలకు దగా

గౌరవసభలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ప్రభుత్వ వైఖరిపై మండిపాటు

పుట్టపర్తి రూరల్‌, జనవరి 28: ప్రభుత్వం మహిళలు, రైతులను దగాకు గురిచేస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.   శుక్రవారం మండల పరిధిలోని కొట్లపల్లిలో గౌరవసభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశన్నంటుతున్నా అరికట్టడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. వ్యవసాయ పనిముట్లు, డీజిల్‌, గ్యాస్‌, ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందన్నారు. మన రాష్ట్రం కంటే పొ రుగున ఉన్న రాష్ట్రాల్లో ఎంతో తక్కువ ఉన్నాయని తెలిపారు. చట్టసభల్లో మహిళలను కించపరుస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమె త్తారు.  2019 నుంచి నేటి వరకు 14వేల మంది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని వారిని ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేద న్నా రు. అధికారంలో లేనప్పుడు ఊరూరు తిరిగిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ఇప్పుడు రైతుల బాధలు తెలియడం లేదా అని ప్రశ్నించారు. ఇంతవరకు ఏముఖ్యమంత్రి చేయని విధంగా అప్పులు చేసి రికార్డు సృష్టించారన్నారు. పథకాలు అమలుకు జనాలతో మద్యం తాగించి, ఆదాయం పొందటం ఈముఖ్యమంత్రికే  చెల్లుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల రూరల్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, మాజీ వైస్‌ ఎంపీపీ బొమ్యయ్య, సీనియర్‌ నాయకులు శ్రీరామిరెడ్డి, సర్పంచులు ప్రవీణ్‌, వెంకటప్ప, మాజీ సర్పంచులు మురారి, పెద్దరంగప్ప, మాజీ ఎంపీటీసీలు నాగిరెడ్డి, రంగప్ప, నాయకులు జగన్‌, రామయ్యశెట్టి, కుమార్‌శెట్టి, నారాయణస్వామి, ఓబల రెడ్డి, రామా రాధాకృష్ణ, నరసింహులు, తిప్పన్న, కోట్లపల్లి రాచువారిపల్లి ఇరగరాజుపల్లి యువకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:58:38+05:30 IST