భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారికి యూఏఈలో అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-07-26T17:47:33+05:30 IST

యూఏఈలో భారత్‌కు చెందిన వ్యాపార వేత్తకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ.. అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారికి యూఏఈలో అరుదైన గౌరవం

అబుధాబి: యూఏఈలో భారత్‌కు చెందిన వ్యాపార వేత్తకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ.. అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వైస్ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. అబుధాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఏడీసీసీఐ)కి నూతన డైరెక్టర్లతో బోర్డును ఏర్పాటు చేయాలని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ తాజాగా తీర్మానించారు. ఈ క్రమంలోనే 29 మంది బోర్డు సభ్యులు ఉన్న ఏడీసీసీఐకి ఇండియాకు చెందిన యూసుఫ్ అలీ వైస్ చైర్మన్‌గా నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో లులూ సంస్థల ఛైర్మన్ యూసుఫ్ అలీ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకకుండా యూఏఈ-ఇండియా మధ్య ఉన్న వాణిజ్య బంధాల మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. 


Updated Date - 2021-07-26T17:47:33+05:30 IST