Jul 29 2021 @ 22:21PM

Maa: ఎన్నికల తేదీ నిర్ణయం డీఆర్‌సీకి...

‘మా’ ఎన్నికలకు సంబంధించి గురువారం ఈసీ మీటింగ్‌ జరిగింది. కృష్ణంరాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మురళీమోహన్‌, మోహన్‌బాబు, ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌, కార్యదర్శి జీవితలతోపాటు ఇతర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ కూడా పాల్గొన్నారు. క్రమశిక్షణా సంఘంలోకి కొత్తగా సీనియర్‌ నటులు గిరిబాబు, శివకృష్ణలను చేర్చుకున్నారు. దీనితో క్రమశిక్షణా సంఘం (డీఆర్‌సీ) సభ్యుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆగస్ట్‌ మూడోవారంలో సర్వసభ్య సమావేశం పెట్టాలని సంఘం నిర్ణయించింది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని మెజారిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనిపై తుది నిర్ణయాన్ని క్రమశిక్షణా సంఘం తీసుకుంటుందని నిర్ణయించారు. అతి త్వరలో క్రమశిక్షణా సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు ఎప్పుడనేది ఏజీఎమ్‌లో ప్రకటిస్తారు. 

చట్టబద్దత ఉంది: న్యాయవాది కృష్ణమోహన్‌

ప్రస్తుత బాడీకి చట్టబద్దత ఉందా లేదా అన్నదానిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుత బాడీ కొత్త కమిటీ వచ్చే వరకూ కొనసాగుతుందనే విషయాన్ని, దానికి చట్టబద్ధత ఉందనే విషయాన్ని ‘మా’ న్యాయ సలహాదారు కృష్ణమోహన్‌ సభ్యులకు వివరించారు.