పెన్సిల్ మొనపై అమ్మవారి రూపు

ABN , First Publish Date - 2020-10-24T18:57:48+05:30 IST

నవరాత్రుల సందర్భంగా పెన్సిల్‌ మొనపై అమ్మవారి రూపును మైక్రో ఆర్టిస్ట్ గట్టెం వెంకటేశ్ తీర్చిదిద్దారు. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఈ విశాఖ కుర్రాడు..

పెన్సిల్ మొనపై అమ్మవారి రూపు

విశాఖ: నవరాత్రుల సందర్భంగా పెన్సిల్‌ మొనపై అమ్మవారి రూపును మైక్రో ఆర్టిస్ట్ గట్టెం వెంకటేశ్ తీర్చిదిద్దారు. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఈ విశాఖ కుర్రాడు.. దసరా శుభాకాంక్షలను తనదైన శైలిలో ఈ విధంగా తెలిపారు. వెంకటేశ్ రూపుదిద్దిన ఈ ఆకృతి పలువురిని ఆకట్టుకుంటోంది. ఆదిపరాశక్తి ముఖాన్ని అందంగా తీర్చిదిద్దిన వైనం కళాభిమానుల మనసులను దోచుకుంటోంది. ఈ చిత్రాలను వెంకటేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 


పెన్సిల్‌‌తో మాత్రమేగాక ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు, అగ్గి పుల్ల తదితరాలతో అద్భుతాలను ఆవిష్కరించడం గట్టెం వెంకటేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరక ఎన్నో కళాకృతులను రూపొందించారు. టూత్ పిక్‌పై వెంకటేశ్ రూపొందించిన న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏకంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది.  


గిన్నిస్ కెక్కిన చిన్నదొడ్డిగల్లు కుర్రాడు


Updated Date - 2020-10-24T18:57:48+05:30 IST