ప్రకాష్‌రాజ్‌కు 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ లేఖ

'మా' ఎన్నికల సీసీ ఫుటేజీ అందించాలంటూ ఎన్నికల అధికారిని ప్రకాష్‌రాజ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ లేఖ రాశారు. ఎన్నికల సీసీ ఫుటేజ్‌ అందజేయాలన్న ప్రకాష్‌రాజ్‌ అభ్యర్థన మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించాం. 'మా' ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మంచు విష్ణు గెలుపును మీరు కూడా ఆహ్వానించారు. మీరు ఆరోపిస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్‌ ట్యాంపరింగ్‌ జరగలేదు. మీ అభ్యర్థన మేరకు ఒక కాపీని అందజేస్తాం.. అని వి.కృష్ణమోహన్‌ తెలిపారు. 

Advertisement
Advertisement