"మా" ఎన్నికలను ఎవరు అనౌన్స్‌ చేశారు.. కోట శ్రీనివాసరావు ఆగ్రహం

హైదరాబాద్: ‘మా’ ఎన్నికల వివాదంపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబేట్‌లో మాట్లాడారు. తాను రెండు విషయాలు అడగ దలుచుకున్నానని చెప్పారు. అసలు "మా" ఎన్నికలను ఎవరు అనౌన్స్‌ చేశారని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా?. ఏదో ప్యానల్‌ అని అనౌన్స్‌ చేశారు.. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమ్‌ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు.. ఇప్పుడది అనవసరం. ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి మద్దతిచ్చారో.. లేదో.. నాకు తెలియదు. నాగబాబు కూడా ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు.’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు. 


Advertisement
Advertisement