మారిన మాట

‘‘ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారనేది నాకు నెంబర్ ఐడియా లేదు కానీ.. ఎన్నికలకు సీసీ కెమెరాలు పెట్టడం మాత్రం జరిగింది. ప్రకాశ్ రాజ్‌గారు ఈ రోజు రాసిన లెటర్‌లో సీసీ టీవీ ఫుటేజ్ కావాలని అడిగారు. ‘లా’ ప్రకారం ఆయన అడిగింది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గరకు రాలేదు. ‘మా’ ఆఫీస్‌కు ఫోన్ చేసి అడిగితే.. సీసీటీవీ ఫుటేజ్ తీసినవారు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ ఇస్తామని అన్నారు. కాబట్టి.. ఇంకో 24 గంటల్లో అది నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది సేఫ్‌గా ఉందని చెప్పగలను..’’. ఇది ప్రకాశ్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ చెప్పిన మాటలు. అక్టోబర్ 14న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ దాదాపు పదిరోజులు కావస్తున్నా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోగా ఇప్పుడు ఫుటేజ్‌కి సంబంధించిన వ్యవహారం నా పరిధిలో లేదంటూ, అది ‘మా’ అధ్యక్షుడైన మంచు విష్ణు నిర్ణయమే అంటూ ఆయన మాట మార్చడం ఇప్పుడనేక అనుమానాలకు తావిస్తోంది.

దీనికి మధ్యలో కూడా చాలా సార్లు ఆయన మాట మార్చారు. ‘‘ప్రకాశ్ రాజ్‌ అభ్యర్థన మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించాం. ‘మా’ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మంచు విష్ణు గెలుపును మీరు(ప్రకాశ్ రాజ్) కూడా ఆహ్వానించారు. మీరు ఆరోపిస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్‌ ట్యాంపరింగ్‌ జరగలేదు. మీ అభ్యర్థన మేరకు ఒక కాపీని అందజేస్తాం..’’ అని ప్రకాశ్ రాజ్‌కు లేఖ రాసిన కృష్ణమోషన్.. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చే ప్రసక్తే లేదని, కావాలంటే కోర్టుకు వెళ్లమనేలా వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఇప్పుడేమో అసలు అది నా పరిధే కాదు.. ఎన్నికలు నిర్వహించడం వరకే నా పని. ఆ తర్వాత జరిగే పరిణామాలు నా పరిధిలోకి రావంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఖచ్చితంగా ‘మా’ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, అందుకే ఎన్నికల అధికారి ఇలా మాటలు మారుస్తున్నాడనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

‘మా’ ఎన్నికల వేళాయెరా!మరిన్ని...

Advertisement