శింబు మూవీ రైట్స్ దక్కించుకున్న గీతా‌ఆర్ట్స్?

సరికొత్త కాన్సెప్ట్స్ ను కైవసం చేసుకోవడంలో గీతా‌ఆర్ట్స్ సంస్థ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇటీవల ‘నాయాట్టు’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ షూటింగ్ ను మొదలుపెట్టిన గీతా ఆర్ట్స్ సంస్థ.. ఇప్పుడో తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ రైట్స్ కూడా దక్కించుకోవడం విశేషం. శింబు నటించిన ఆ సినిమా పేరు ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఇటీవల కోలీవుడ్ లో విడుదలై.. ఘన విజయం సాధించింది. లూప్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని తెలుగులో ‘ది లూప్’ గా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 


సాయిధరమ్ తేజ్‌తో కానీ, అల్లు శిరీష్‌తో కానీ ‘మానాడు’ చిత్రాన్ని రీమేక్ చేయాలని చూస్తున్నారట. కొంత కాలంగా హిట్స్ లేని శింబు ఈ సినిమాతో ఎట్టకేలకు సూపర్ హిట్ దక్కించుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన ప్రకటన రాబోతోంది. ‘ఎడ్జ్ టు టుమారో’ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ఎంతవరకూ ఆదరిస్తారో చూడాలి. 

Advertisement
Advertisement