మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆవిష్కరించిన Apple

ABN , First Publish Date - 2022-06-08T00:43:53+05:30 IST

కొత్త M2 చిప్‌ ఆధారిత కొత్త రీడిజైన్ చేయబడిన MacBook ఎయిర్‌ని Apple ఆవిష్కరించింది,

మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆవిష్కరించిన Apple

న్యూయార్క్ : కొత్త M2 చిప్‌ ఆధారిత కొత్త రీడిజైన్ చేయబడిన MacBook ఎయిర్‌ని Apple ఆవిష్కరించింది, దీంతోపాటు 13-అంగుళాల MacBook Pro కొత్త వెర్షన్‌ను కూడా కొత్త చిప్ బూస్ట్‌ను పొందుతుంది. M2 చిప్‌తో కూడిన Apple కొత్త MacBook Air USలో $1199 ధరను నిర్ణయించారు. భారత కరెన్సీలోనైతే,,, డాలర్‌కు రూ. 77. 79 చొప్పున... రూ. 93,266.49. భారత్‌లో Apple కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను రూ. 119,900, విద్య కోసం రూ. 109,900 కు విక్రయిస్తోంది. భారత్‌లో చెల్లించే దానికి, USలో చెల్లించే దానికి మధ్య దాదాపు రూ. 26,634 ధర మేర తేడా ఉంటుంది.


కాగా... Apple పరికరాలే కాకుండా... కంపెనీల దాదాపు అన్ని పరికరాలు కూడా USలో సాధారణంగా చౌకగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... Apple ప్రస్తుతం భారతదేశంలో తన ఐఫోన్‌లలో కొన్నింటిని మాత్రమే తయారు చేస్తోందన్న విషయం తెలిసిందే. కాగా...  కొత్త MacBook Air, M2-శక్తితో పనిచేసే MacBook Pro... రెండూ కూడా అమెరికాలో చౌకగా లభిస్తాయి. భారత్‌లో... M2తో కూడిన MacBook Air ధర రూ. 1.19 లక్షలు, విద్య కోసమైతే రూ. 1,09,900. M2తో కూడిన 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1.29 లక్షలు, విద్య కోసం రూ. 1,19,900.

Updated Date - 2022-06-08T00:43:53+05:30 IST